Latest News

Tuesday, March 1, 2016

2018లో శ్రీకాంత్ తో రాజకీయం చేయిస్తా - నిర్మాత షేక్ మస్తాన్


2018లో శ్రీకాంత్ తో రాజకీయం చేయిస్తా - నిర్మాత షేక్ మస్తాన్

అఖండ భారత్ క్రియేషన్స్  పతాకం పై శ్రీకాంత్ కధానాయకుడిగా సతీష్ కాశెట్టి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 'టెర్రర్' ఇటివలే విడుదలై విజయం పథం లో దూసుకెళ్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత షేక్ మస్తాన్ విలేకరులతో మాట్లాడారు. 

'టెర్రర్' అనే సినిమా ఇంతటి  విజయం సాధిస్తుందని మేము అస్సలు ఊహించలేదు. ఒక మంచి కథ తో తెరకెక్కిన కథ కాబట్టి మొదట కాస్త నార్మల్ టాక్ వచ్చిన ఆ తరువాత మంచి విజయం అందుకుంటుందని ఆశించాము. కాని ఈ చిత్రం మా అంచనాలను తారుమారు చేసిందనే చెప్పాలి. మొదటి రోజే చాలా మంచి టాక్ కైవసం చేసుకుంది. తొలి రోజే ప్రేక్షకులు ధియేటర్ కు వచ్చి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. విడుదల రోజు ఉదయం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో? అని కాస్త  టెన్షన్ పడినప్పటికీ ఒక మంచి సినిమా తీస్తే అందరు అభినందిస్తారని విజయం అందిస్తారని మరో సారి మా 'టెర్రర్' చిత్రం రుజువు చేసింది. ఇప్పటికీ కంటిన్యూ గా ఫోన్ లో అభినందనలు అందుకున్తున్నాను. ఈ సందర్భంగా మా చిత్రాన్ని ఆదరించి ఇంతటి విజయం చేసిన అందరికీ మా సంస్థ తరుపున నా ధన్యవాదాలు.  

సినిమా పరిశ్రమ కోసం చాలా మంది ఎన్నో మైనస్ పాయింట్స్ చెప్పారు. ఆ చెడు గా చెప్పిన వాళ్ళ మాటలు విని అవునేమో అనుకున్నా. కాని శ్రీకాంత్ ని కలిసాక ఆ మాటలు నిజం కావని తెలుసుకున్నా. ఈ సినిమా కథ తో శ్రీకాంత్ గారిని కలిసి నప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ప్రోత్సాహం నా సంస్థ ను తన సొంత సంస్థ గా జాగ్రత్త తీసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. అందుకే శ్రీకాంత్ గారి తో మా బ్యానర్ పై  2018 లో ఎన్నికల ముందు ఒక రాజకీయ నేపధ్యం లో సంచలనమైన సినిమా  నిర్మిస్తాను..

ఈ సినిమా ప్రారంభించి నప్పటి నుండి ఈ చిత్ర షూటింగ్ కి పెద్దగా వెల్లలేదనే చెప్పాలి. నా వ్యాపారాలతో బిజీ గా ఉండటం వాళ్ళ సెట్స్ కి వెళ్ళడం పెద్దగా కుదరలేదు. అయినప్పటికీ..
నేను పెట్టిన ప్రతి రూపాయి సినిమా లో కనిపించేలా జాగ్రత్తగా తెరకెక్కించారు దర్శకుడు సతీష్, శ్రీకాంత్. వీరిద్దరూ ఈ చిత్రాన్ని తమ సొంత సినిమా గా భావించి రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా వీరిద్దరితో పాటు  యూనిట్ కి నా టీం కి ధన్యవాదాలు చెప్ప్తున్నా.

తొలి సినిమా కు ప్రేక్షకులు  అందించిన విజయం తో మా 'అఖండ భారత్ క్రియేషన్స్' బ్యానర్ లో మరో సినిమాను ప్రారంభించబోతున్నా. ఇంకో 15 రోజుల్లో ఆ సినిమా ను ప్రారంభించి సెట్స్ పైకి తీసుకెళ్తాను. అంతే కాకుండా మా బ్యానర్ పై సంవత్సరానికో మంచి సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నాను. మరిన్ని సమాజం పై  కథలు దొరికితే ఏడాదికి 2 కూడా నిర్మిస్తా.

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in/

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

No comments:

Post a Comment