Latest News

Monday, February 29, 2016

2016 ఆస్కార్ కి నామినేటైన చిత్రాలకి ఎలాంటి కెమెరాలు వాడారో తెలుసా..? Which Cameras Were Used on the Oscar-Nominated Films of 2016.. ?


2016 ఆస్కార్ కి నామినేటైన చిత్రాలకి ఎలాంటి కెమెరాలు వాడారో తెలుసా...?

THE REVENANT

​Nominated for Best Picture (Arnon Milchan, Steve Golin, Alejandro G. Iñárritu, Mary Parent and Keith Redmon), Best Director (Alejandro González Iñárritu), and Best Cinematography (Emmanuel Lubezki).

Cameras: Arri Alexa 65, Arri Alexa XT M, Arri Alexa XT, Red Epic Dragon (some scenes).

Lenses: Hasselblad Prime 65 Lenses, Panavision Primo, C-Series, Leica Summilux-C and Zeiss Master Prime Lenses.


THE BIG SHORT

Nominated for Best Picture (Brad Pitt, Dede Gardner and Jeremy Kleiner) and Best Director (Adam McKay)

Cameras: Arricam LT, Canon EOS C500.

Lenses: Angenieux Optimo Lenses, Panavision Primo Lenses.




BRIDGE OF SPIES


Nominated for Best Picture (Steven Spielberg, Marc Platt and Kristie Macosko Krieger).

Cameras: Arricam LT, Arricam ST, Arriflex 235, Arriflex 435 Advanced.

Lenses: Hawk V-Lite, V-Lite Vintage '74 and V-Plus Lenses.



BROOKLYN


Nominated for Best Picture (Finola Dwyer and Amanda Posey).

Cameras: Arri Alexa XT.

Lenses: Zeiss Master Prime, Super Speed and Leica Summilux-C lenses.​



MAD MAX: Fury Road


Nominated for Best Picture (Doug Mitchell and George Miller), Best Director (George Miller), and Best Cinematography (John Seale).

Cameras: Arri Alexa M, Arri Alexa Plus, Blackmagic Cinema Camera (some shots), Canon EOS 5D Mark II (some shots), Olympus P5 (some shots).

Lenses: Panavision Primo, Primo Zoom, Ultra Speed and Angenieux Optimo Lenses.




THE MARIN


​Nominated for Best Picture (Simon Kinberg, Ridley Scott, Michael Schaefer and Mark Huffam).

Cameras: GoPro HERO4, Red Epic Dragon, Red Scarlet Dragon

Lenses: Fujinon Premier Cabrio, Angenieux Optimo and Optimo DP Lenses




ROOM


​Nominated for Best Picture (Ed Guiney) and Best Director (Lenny Abrahamson), 

Cameras: Red Epic Dragon.

Lenses: Panavision Primo and Ultra Speed MKII Lenses.


SPOTLIGHT


​Nominated for Best Picture (Michael Sugar, Steve Golin, Nicole Rocklin and Blye Pagon Faust) and Best Director (Tom McCarthy).

Cameras: Arri Alexa XT, Panavision Lightweight .

Lenses: PCZ, Super Speed Z-Series MKII, Ultra Speed Z-Series MKII and Angenieux Optimo Lenses.


CAROL


​Nominated for Best Cinematography (Ed Lachman).

Cameras: Arriflex 416.

Lenses: Cooke Speed Panchro, Varopanchro, Zeiss Master Zoom and Angenieux HR Lenses 
Cooke S4/i Lenses​.


THE HATEFUL EIGHT


​Nominated for Best Cinematography (Robert Richardson).

Cameras: Panavision 65 HR Camera, Panavision Panaflex System 65 Studio.

Lenses: Panavision APO Panatar Lenses.



SICARIO


​Nominated for Cinematography (Roger Deakins).

Cameras: Arri Alexa XT M, Arri Alexa XT Plus, Arri Alexa XT Studio .

Lenses: Zeiss Master Prime Lenses.



 ----రవి కిరణ్ మాదినీడి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us








Saturday, February 27, 2016

‘క్షణం’ సినిమా రివ్యు || Tolly Beats


‘క్షణం’ సినిమా రివ్యు || Tolly Beats


Tolly Beats Rating: 4.25/5

తెలుగు, తమిళ భాషల్లో ఓ పక్క వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వెళుతోన్న పీవీపీ సినిమా, మరోపక్క పూర్తిగా కొత్తదనమున్న చిన్న సినిమాలను కూడా నిర్మించే ఆలోచనతో క్షణంఅనే ప్రయోగాత్మక సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. అడవి శేష్, అదాశర్మ, అనసూయ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత కొద్దికాలంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మరి ఆ క్రేజ్‌ను నిలబెట్టేలా సినిమా ఉందా? చూద్దాం..

కథ :

రిషి (అడివి శేష్) అమెరికాలో సెటిలైన ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. అక్కడే జీవనం సాగిస్తూండే రిషి, అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ అయిన శ్వేత (అదా శర్మ) నుంచి వచ్చిన కాల్‌తో ఆమెను కలిసేందుకు ఇండియా వస్తాడు. రిషి ఇండియా వచ్చేశాక శ్వేత, తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారన్న షాకింగ్ విషయాన్ని అతడికి చెప్తుంది.

ఆ పాపను వెతకడం కోసం రిషి, పోలీసులను ఆశ్రయిస్తే వారినుంచి కూడా సరైన స్పందన దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో రిషి, తానే స్వయంగా పాపను వెతికే ప్రయాణం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ కిడ్నాప్ కథేంటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :

క్షణంసినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఇలాంటి కొత్తదనమున్న థ్రిల్లింగ్ సినిమాను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేయడం గురించి చెప్పుకోవాలి. మొదట్నుంచి చివరివరకూ ఎక్కడా సినిమా ఫ్లో మిస్ అవ్వకుండా పకడ్బందీగా అల్లిన సన్నివేశాలు బాగా మెప్పిస్తాయి. ఒక థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగాన్ని ఎక్కడా తగ్గించకుండా, ఎమోషనల్‌గా ఇలాంటి కథను చెప్పడంలో తీసుకున్న జాగ్రత్తలు అబ్బురపరుస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఒక బలమైన సెకండాఫ్‌కు లీడ్‌గా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది.

ఇక నటీనటులంతా ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్ళేలా చేశారనే చెప్పుకోవచ్చు. అందరికంటే ముఖ్యంగా అడివి శేష్, సినిమాను దాదాపుగా తన భుజాలపై మోశాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ ఫ్రేం దగ్గర్నుంచి చివరి ఫ్రేం వరకూ అడివి శేష్ అద్భుతమైన నటన ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఒక టఫ్ క్యారెక్టర్‌లో అదా శర్మ మంచి ప్రతిభ చూపింది. ఎమోషనల్ సన్నివేశాల్లో అదా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో పూర్తి స్థాయి పాత్రలో నటించి, వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఒక పోలీస్ పాత్రలో చాలా బాగా నటించింది. అనసూయకు ఈ సినిమా కచ్చితంగా సూపర్ డెబ్యూట్ అనే చెప్పాలి. ఇక జ్యోతిలక్ష్మిసినిమాతో హీరోగా మెప్పించిన సత్యదేవ్, మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. సత్యదేవ్ నటన ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో అక్కడక్కడా కొన్ని విషయాలను పూర్తిగా చెప్పకుండా మధ్యలో వదిలేసినట్లనిపించింది. అదేవిధంగా అనసూయ పాత్ర కొన్ని పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో వచ్చే సన్నివేశాలు సహజత్వానికి కొంచెం దూరం ఉన్నట్లు అనిపించింది. ఇక సెకండాఫ్‌లో సినిమా వేగం కాస్త మందగించినట్లు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే ఓ పాట కూడా సినిమా ఫ్లోను కాస్త దెబ్బతీసిందనే చెప్పాలి. ఇక ఈ తరహా కథాంశం, కథనం ఉన్న సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే చూసేవారికి పెద్దగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో క్షణం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉన్న సినిమాగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పుకోవచ్చు. లిమిటెడ్ బడ్జెట్‌లోనే పీవీపీ సినిమా ఈ స్థాయి ఔట్‌పుట్‌ను తీసుకురావడాన్ని మెచ్చుకోవాల్సిందే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! సినిమా మూడ్‌ను క్యారీ చేస్తూనే సినిమాటోగ్రాఫర్ చేసిన ప్రయోగాలు అబ్బురపరుస్తాయి. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చెప్పాలంటే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చరణ్ సినిమా స్థాయిని పెంచాడు. అడివి శేష్‌తో కలిసి దర్శకుడు రవికాంత్ పేరేపు రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది.

ఇక దర్శకుడు రవికాంత్ గురించి చెప్పుకుంటే, మొదటి సినిమా అంటే ఓ దర్శకుడిలో కనిపించే కసిని ఈ సినిమాలో చూడొచ్చు. ఇలాంటి ఒక సినిమాను తీయాలన్న ఆలోచనతో పాటు, అందుకు సరైన స్క్రీన్‌ప్లేను రాసుకోవడం, సన్నివేశాలను కూర్చడం, సస్పెన్స్‌ను చివరివరకూ కొనసాగించడం వంటి విషయాల్లో రవికాంత్ ప్రతిభ మెచ్చుకోతగినది. దర్శకుడిగా రవికాంత్ మేకింగ్ పరంగా చాలాచోట్ల ప్రయోగాలు చేశాడు.

తీర్పు :

తెలుగులో డిఫరెంట్ సినిమా అనే కాన్సెప్ట్‌కు కొద్దికాలంగా మంచి ఆదరణ కనిపిస్తూ వస్తోంది. కొత్తదనమున్న సినిమా ఏది వచ్చినా దాన్ని ఆదరిస్తామన్న విషయాన్ని ప్రేక్షకులూ స్పష్టం చేస్తూ డిఫరెంట్ సినిమాకు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ తరహా సినిమాలను కోరే వారిని దృష్టిలో పెట్టుకొని వచ్చి, అందరినీ మెప్పించిన సినిమాయే క్షణం’. డిఫరెంట్ కథాంశం, మొదట్నుంచీ చివరివరకూ ఎక్కడా పడిపోని వేగం, ఆసక్తికరమైన సస్పెన్స్ ఎలిమెంట్స్.. ఇవన్నీ కలిపి క్షణంసినిమాకు ఒక అర్థాన్ని తెచ్చిపెట్టాయి. ఇకపోతే రెగ్యులర్ కమర్షియల్ అంశాలను కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కొత్తదనమున్న సినిమాను బాగా కోరేవారు, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకునే వారికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది.


రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

‘వీరి వీరి గుమ్మడి పండు’ సినిమా రివ్యు || Tolly Beats



‘వీరి వీరి గుమ్మడి పండు’ సినిమా రివ్యు


Tolly Beats Rating: 1.25/5

శివ కృతి క్రియేషన్స్ పతాకంపై కేలం కిరణ్ కుమార్ నిర్మించిన సినిమా వీరి వీరి గుమ్మడి పండు. లవ్, ఫ్యామిలీ, హర్రర్ ఎలిమెంట్స్ ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్ర, సంజయ్, వెన్నెల ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్.వీ.సాగర్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాను రూపొందించారు. మొత్తం 63 మంది కొత్తవాళ్ళను పరిచయం చేస్తూ రూపొందిన సినిమాగా ప్రచారం పొందిన వీరి వీరి గుమ్మడి పండు’, ఎంతవరకు ఆకట్టుకుందీ? చూద్దాం…

కథ :

రావు గారి కుటుంబం ఓ సూపర్ స్టార్ ఎంతో ఇష్టంగా కట్టించుకొని, కలిసిరాక వదిలేసిన ఓ బంగ్లాను కొనుగోలు చేస్తుంది. పిల్లల అల్లరి, పెద్దల ప్రేమానురాగాలతో ఎంతో సరదాగా సాగిపోయే వారి జీవితాల్లోకి అనూహ్యంగా కొన్ని మలుపులు వస్తాయి. బంగ్లాలో జరిగే ఏవేవో విచిత్ర పరిస్థితులు ఆ కుటుంబానికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అసలు ఆ బంగ్లాలో ఏం ఉంది? ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న అదృశ్య శక్తి ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ సమస్యల నుంచి తమ కుటుంబాన్ని రావు గారి కుమారులు చిట్టి (రుద్ర), బాబు(సంజయ్) ఎలా కాపాడుకున్నారు? అన్నది కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ సమయంలో మేకింగ్ పరంగా, సస్పెన్స్ పరంగా చూపిన ప్రతిభ గురించి చెప్పుకోవచ్చు. అప్పటివరకూ సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడంతో ఈ పార్ట్‌లో సస్పెన్స్ ఎలిమెంట్‌ను బాగానే పట్టుకున్నారు. ప్రీ క్లైమాక్స్ కూడా ఉన్నంతలో బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడానా?’ అన్న ఆలోచనను పక్కనబెడితే, సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్ చాలా బాగుంది.

నటన పరంగా చూసుకుంటే రుద్ర తన పాత్రలో బాగా మెప్పించాడు. ఉన్నంతలో అందరిలోకెల్లా అతడి పాత్రకే ఒక సరైన అర్థం ఉండడంతో, ఆ పాత్రలో రుద్ర ఆకట్టుకున్నాడు. సంజయ్ సినిమాకు ప్రధానమైన సన్నివేశాల్లో కనిపిస్తూ ఫర్వాలేదనిపిస్తాడు. కీలక పాత్రల్లో నటించిన చిన్నారులు హార్దికేష్, రుషిత బాగా చేశారు. ఇక పోసాని కృష్ణ మురళీ, రఘు బాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటూ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాజుగారి గదిఅనే హర్రర్ కామెడీ ఫార్మాట్‌లో సాగిపోయే ఈ సినిమాలో మొత్తమ్మీద కథలో ఉన్న ఒకే ఒక్క ఎలిమెంట్.. క్లైమాక్స్. ఇక ఆ క్లైమాక్స్ వరకూ సినిమాలో ఒక సరైన పద్ధతిలో ఒక్క సన్నివేశమంటూ రాకపోవడం, ఫన్, ఎమోషన్ లాంటివి అస్సలు లేకపోవడం, అర్థం పర్థం లేని పాత్రలు.. అన్నీ కలిపి సినిమాను ఎటు తీసుకుపోతున్నాయో కూడా అర్థం కాదు. సస్పెన్స్ ఎలిమెంట్ చుట్టూ ఒక బలమైన కథంటూ లేకపోవడం, దానికి కనీసం ఫర్వాలేదనిపించేలా కూడా కథనం లేకపోవడం సినిమా పూర్తిగా నిస్సత్తువగా సాగిపోతుంది.

హీరోయిన్ పాత్ర సినిమాలో ఎందుకొస్తుందో అర్థం కాదు. ఇక ఆ పాత్రలో నటించిన వెన్నెల కూడా అందాల ప్రదర్శనలో తప్ప నటన పరంగా చేసిందేమీ లేదు. పాటలు కూడా అసందర్భంగా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వచ్చేస్తుండడం కూడా విసుగు తెప్పిస్తుంది. ఈ సినిమా కథకు, మరీ రెండున్నర గంటలున్న నిడివికి పొంతనే లేదు. లవ్, ఫ్యామిలీ, హర్రర్ ఎలిమెంట్స్ ప్రధానంగా తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమాలో నిజానికి అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడం విచిత్రంగా తోస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో బాగా చేశారని చెప్పుకోవాల్సి వస్తే, సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రాఫర్ ఉన్నంతలో సినిమాకు ఒక మూడ్ తేగలిగారు. అసలు ఏమాత్రం బలం లేని సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ పనితనం వల్లే కాస్త అయినా చూడగలం. ఇక సంగీత దర్శకుడు పీ.ఆర్. అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నాసిరకంగా ఉంది. పాటల్లో ఉన్నంతలో వెన్నెలపాట ఫర్వాలేదు. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఇక దర్శక, రచయిత ఎం.వీ.సాగర్ గురించి చెప్పుకుంటే, ఒక్క క్లైమాక్స్‌లో తప్ప దర్శకుడిగా ఆయన ఈ సినిమాతో ఎక్కడా మెప్పించలేదు. ఒక సస్పెన్స్ ఎలిమెంట్ చుట్టూ సాదాసీదా కథను అల్లడం, ఆ కథను చెప్పేందుకు రాసుకున్న స్క్రీన్‌ప్లే కూడా ఎక్కడా బాగోలేకపోవడం, మేకింగ్ పరంగానూ ఎక్కడా కొత్తదనం చూపకపోవడం.. ఇవన్నీ కలిపి చూస్తే, దర్శకుడిగా ఎం.వీ.సాగర్ నిరుత్సాహపరిచాడనే చెప్పుకోవాలి.

తీర్పు :

కొత్త దర్శకుడి సినిమా అనగానే సహజంగానే ఏదో ఒక కొత్తదనం ఆశించడమో, లేదంటే, తెలిసిన విషయాన్నే పద్ధతిగా చెప్పడాన్ని కోరుకోవడమో చేస్తుంటాం. అయితే వీరి వీరి గుమ్మడి పండు’, మొత్తం 63 మంది కొత్తవారిని పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు తీసిన అర్థం లేని సినిమా. ఒక్క చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల నిడివి గల సినిమా చెప్పాలనుకోవడం, అందులో ఎక్కడా కట్టిపడేసే తరహా సన్నివేశాలు లేకపోవడం, ఒక కథంటూ లేకపోవడం, కథనం కూడా ఎటుపోతుందో తెలీనంత గందరగోళంగా ఉండడం లాంటివన్నీ కలిపి ఈ సినిమాను ఒక నాసిరకం సినిమాగానే మిగిల్చాయి. రెండున్నర గంటల నసను భరించగలిగితే ఇంటర్వెల్, క్లైమాక్స్‌ పార్ట్స్ మాత్రం నచ్చొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వీరి వీరి గుమ్మడి పండుసినిమా ప్రచార చిత్రాల్లోనే చెప్పినట్లు, ఇది ఏ జానర్ సినిమానో అని చూస్తే, ఏదీ కానీ, అన్నీ కలిసిన ఒక కలగాపులగం అనీ, ఎటూ తెలియకుండా వెళ్ళిపోయిన ఒక అర్థం లేని సినిమాఅని స్పష్టంగా అర్థమవుతుంది!


రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

‘పడేసావే’ సినిమా రివ్యు || Tolly Beats



‘పడేసావే’ సినిమా రివ్యు || Tolly Beats


Tolly Beats Rating: 1.75/5

జీ తెలుగులో యువఅనే టీవీ సీరీస్ చేసి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ చునియా. కింగ్ అక్కినేని నాగార్జున గారి ప్రోత్సాహంతో చునియా చేసిన మొదటి ఫీచర్ ఫిల్మ్ పడేసావే’. ‘టిప్పుసినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తీక్ రాజ్ హీరోగా నిత్య శెట్టి, జహీద శ్యామ్ హీరోయిన్స్ గా చేసిన ఈ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బుల్లితెర డైరెక్టర్ చునియా వెండితెరపై కూడా ప్రేక్షకులు మెచ్చుకునే సినిమా చేసిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

కార్తీక్(కార్తీక్) విశ్వ(విశ్వ) ఇద్దరు మంచి ఫ్రెండ్స్.. కార్తీక్ సరిగ్గా చదవక స్టడీస్ లో ఫెయిల్ అవుతూ ఇంట్లో తిట్లు తింటూ లైఫ్ ని గడుపుతుంటాడు. కార్తీక్ పక్క ఇంట్లో ఉండే అమ్మాయే నిహారిక(నిత్యా శెట్టి). కార్తీక్ నిహారిక బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే నిహారిక కార్తీక్ ని ప్రేమిస్తుంటుంది. కానీ కార్తీక్ ప్రేమించడు. కట్ చేస్తే అదే టైంలో నిహారిక ఫ్రెండ్ స్వాతి(జహీద శ్యాం)కథలోకి ఎంటర్ అవుతుంది. స్వాతిని చూడగానే కార్తీక్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల కార్తీక్ తనని ప్రేమిస్తున్నాడని ఫిక్స్ అయిపోతుంది నిహారిక.

కానీ కార్తీక్ మాత్రం స్వాతిని ప్రేమిస్తుంటాడు. కట్ చేస్తే నిహారిక కార్తీక్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పించి పెళ్ళికి సిద్దమవుతుంది. కానీ ఆ టైంకే కార్తీక్ తన ప్రేమని స్వాతికి చెప్తాడు. స్వాతి మాత్రం తన ఫ్రెండ్ నిహారిక కోసం కార్తీక్ ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. ఇక ఇక్కడి నుంచి కథ ఏం జరిగింది.? ఫైనల్ గా ఎవరు ఎవరి ప్రేమని అంగీకరించారు? ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఎవరు తమ ప్రేమని త్యాగం చేయాల్సి వచ్చింది అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే…

ప్లస్ పాయింట్స్ :

కింగ్ నాగార్జున ప్రమోషన్స్ విషయంలో ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం, యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ప్రమోట్ చెయ్యడం ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాలో ఓవరాల్ గా కొన్ని కొన్ని మోమెంట్స్ మాత్రం బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరోకి ఫ్రెండ్ గా చేసిన విశ్వ రాజ్ సినిమాలో అతను కనిపించినప్పుడల్లా కాసేపు నవ్వించడానికి ట్రై చేసారు. సినిమాలో బెస్ట్ రిలాక్సింగ్ సీన్స్ విశ్వ చేసినవే..

ఇక నటీనటుల విషయానికి వస్తే.. కార్తీక్ ఉన్నంతలో డీసెంట్ గా నటించాడు. కొన్ని సీన్స్ లో హావభావాల పరంగా ఇంకాస్త మెరుగు పరుచుకోవాలి. ఇక హీరోయిన్స్ లో నిత్యా శెట్టి లో ఎనర్జీ లెవల్స్ బాగున్నాయి. తనకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేసింది. కానీ ఇందులో ట్రై చేసిన లుక్, మేకప్ మాత్రం తనకి సెట్ కాలేదు. ఇక జహీద శ్యాం చూడటానికి బాగుంది, అలాగే ఎమోషనల్ సీన్స్ బాగానే చేసింది. అలనాటి హీరోయిన్ రాశి రెండు మూడు సీన్స్ లో అందరినీ ఆకట్టుకుంది. నరేష్ అనిత చౌదరిలు అక్కడక్కడా కాసేపు నవ్విస్తారు. కార్తీక్ విశ్వల కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. ఇకపోతే ఈ సినిమాని చాలా లో బడ్జెట్ లో తీసారు కానీ ఆన్ స్క్రీన్ విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. అలాగే నిర్మాణ విలువలు బిగ్ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఎప్పుడైనా ఓ సినిమాకి కథే హీరో.. మిగతా ఎన్ని ఉన్నా కథలేకపోతే సినిమా అస్సాం వెళ్లిపోవాల్సిందే.. పైన చెప్పినట్టు ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్. కానీ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కావాల్సిన సరైన కథ లేకపోవడమే బిగ్గెస్ట్ మైనస్. మెయిన్ గా ఈ సినిమాలో చూపిన ట్రై యాంగిల్ లొఎ స్టొరీని ఇప్పటికి మనం చాలా సార్లు చూసాం.. ఎంతలా అంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లతో సహా యాజిటీజ్ గా ఉండే సినిమాలు మన తెలుగులోనే వచ్చాయి. కాబట్టి కథ అనేది ఎక్కడా ఆడియన్స్ ని హుక్ చెయ్యదు. ఆ తర్వాత పాత్రలను రాసుకున్న తీరు కూడా బాలేదు. పాత్రలు అన్నీ పైపైనే ఉన్నట్టు అనిపిస్తాయి. ఏ పాత్ర చూసే ఆడియన్ కి పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవ్వదు. ఇలా ఏ పాత్ర కనెక్ట్ కాకపోతే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ అవ్వరు.

దీనికి తోడు సినిమా మొదటి నుంచీ చివరి దాకా చాలా స్లోగా సాగుతుంది. నేరేషన్ ని ఎక్కడా స్పీడప్ చేసే పని చేయలేదు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టినప్పటికీ అలా అలా సాగిపోయినట్టు ఉంటుంది. కానీ సెకండాఫ్ కి వచ్చే సరికి అస్సలు ముందుకు కదలలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో కమర్షియాలిటీ అనేదాని కోసం అలీ, కృష్ణుడు బాచ్ తో ఓ కామెడీ ఎపిసోడ్ ని పెట్టారు. గే కామెడీ ఫ్లేవర్ వలన ఈ ఎపిసోడ్ నవ్వించకపోగా, ప్రేక్షకులకి చిరాకు తెప్పిస్తుంది. మొదటి నుంచి ఎమోషనల్ బాండింగ్ అనేది సరిగా చూపించకుండా ఒక్కసారిగా సెకండాఫ్ లో ఎమోషనల్ వైపు డ్రైవ్ చేసారు. మొదటి నుంచి ఆ ఫ్లేవర్ లేకపోవడం వలన అవి అంతగా కనెక్ట్ కాలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో పాటలు వరుసబెట్టి వచ్చి సినిమా ఫ్లోని, సినిమా రన్ టైంని బాగా పెంచేసినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సింపుల్ అండ్ లో బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా పడేసావే.. కానీ ఆన్ స్క్రీన్ మీద మాత్రం ఆ ఫీలింగ్ రాదు.. దానికి కారణం మూడు విభాగాలు.. మొదటిది ప్రొడక్షన్ వాల్యూస్. వారు పెట్టిన ప్రతి రూపాయి చాలా గ్రాండ్ గా తెరపై కనిపించింది. ఇక కన్న సినిమాటోగ్రఫీ అదుర్స్. ప్రతి ఫ్రేం, ప్రతి కలర్ ఎఫెక్ట్స్ సినిమా చూసే వారికి మస్త్ ఫీల్ ని కలిగిస్తుంది. ఈ రెండిటి తర్వాత సినిమాకి ప్రాణం పోసింది అనూప్ రూబెన్స్. తన పాటలు బాగున్నాయి. కానీ సినిమాలో ఎక్కువైపోవడం వలన స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి. ఇకపోతే నేపధ్య సంగీతం మాత్రం సీన్స్ లో మిస్ అయిన కంటెంట్ ని కూడా భర్తీ చేసేలా ఉంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ అస్సలు బాలేదు. పురుషోత్తం ఆర్ట్ వర్క్ బాగుంది.

ఇక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన చునియా విషయానికి వస్తే.. చునియా తన మొదటి సినిమాకి చాలా పాత కథని, ఇప్పటికే చాలా సార్లు చూసేసిన కథని ఎంచుకుంది. కథ పాతది అయినా పర్లేదు కథనం కొత్తగా ఉండేలా ట్రై చేయాల్సింది. కానీ కథనం కూడా కథలానే చాలా పాతగా, ఉంది. దానివలన సినిమా చాలా బోరింగ్ గా ఉంటుంది. దర్శకత్వ బాధ్యతలను మాత్రం కొంతవరకూ బాగానే డీల్ చేసింది. స్ట్రాంగ్ కథలేకపోవడం వలన తన దర్శకత్వ ప్రతిభతో ఆడియన్స్ ని థియేటర్స్ లో కూర్చో బెట్టలేకపోయింది. ఇక కిరణ్ రాసిన డైలాగ్స్ కూడా ఓకే ఓకే అనేలా ఉన్నాయి.


ప్యూర్ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పడేసావే సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చెప్పుకోవడానికి యూత్ఫుల్ లవ్ స్టొరీ అని ప్రమోట్ చేసుకున్నా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు కూడా చాలా తక్కువగా ఉండడం చెప్పుకోవాల్సిన అంశం. చునియా బుల్లితెర ఫ్లేవర్ నే వెండితెరపైనా ప్రయోగించింది. అందుకే పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కొన్ని కొన్ని సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ ప్లస్ అయితే పాత కథ, రొటీన్ కథనం, లెస్ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా పడేసావే యూత్ ని మాత్రమే ఆకర్షించే సినిమా కానీ వారిని కూడా పూర్తి స్థాయిలో మెప్పించలేని సినిమా.


 రివ్యూ బై విజ్ఞాన్ దాసరి